| Daily భారత్
Logo




హిందూవులపై రాహుల్ గాంధీ విషం కక్కుతున్నారు... హిందూవులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి

News

Posted on 2024-07-02 14:52:07

Share: Share


హిందూవులపై రాహుల్ గాంధీ విషం కక్కుతున్నారు... హిందూవులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి

హిందువులను విమర్శిస్తే ఊరుకునేది లేదు.

హిందూవులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.

రాహుల్ వ్యాఖ్యలపై బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన జ్వాలాలు.

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : హిందూవులపై రాహుల్ గాంధీ విషం కక్కుతున్నారని మాడిపడ్డారు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి,అందే బాబయ్య ముదిరాజ్..నిన్న లోక్ సభలో హిందువులపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తా వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ,,ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న వ్యక్తి(రాహుల్)హిందూవులంతా 24గంటలు హింస,హింస,హింస,నిత్యం హింస,ద్వేషం, ద్వేషం, ద్వేషం, అసత్యం,అసత్యం, అసత్యంతోనే ఉంటారని చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ యొక్క విధానాలను అర్థం చేసుకోవచ్చని అన్నారు.దేశ ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి,రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ చేస్తున్న విధానాలను గుర్తించాలని సూచించారు.రాహుల్ చేసిన మాటలు, వ్యాఖ్యలు వింటే,చూస్తే కాంగ్రెస్ చేస్తున్నదేంటో ఇట్టే తేలుస్తుందన్నారు.కేవలం 99 సీట్లు మాత్రమే వస్తేనే ఇలా ఉంటే,ఎక్కువ సీట్లు వచ్చి పూర్తి స్థాయిలో అధికారం ఇస్తే హిందువులను ఏం చేస్తారోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..దేశంలో అత్యధిక జనాభా ఉన్న హిందువులను విమర్శిస్తూ,మాట్లాడడం అవమానపరచడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.ఏదైమైనా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఇలా మాట్లాడటం దేశ సమగ్రతకు,దేశానికి అంత అంతమంచిది కాదని సూచించారు.హిందువులను విమర్శిస్తే ఊరకునేది లేదని హెచ్చరించారు.రాహుల్ బేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.లేనిచో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి ప్యాట అశోక్,బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ పుట్నాల సాయికుమార్, కో కన్వీనర్ సుబ్రహ్మణ్యం, పట్టణ అధ్యక్షులు సాయి మండల అధ్యక్షులు వివేక్, జిల్లా నాయకులు మల్చల మురళి, చెట్ల వెంకటేష్, మట్టం ఋషికేష్, భూషణ్ పటేల్, శ్రీనివాస్ చారి, అందేల సందీప్,ఘటోజు విజయ్, వి రవీందర్, శ్యాంసుందర్ అడ్వకేట్  పిట్టల సురేష్, మల్చలం రాము, మంగ విజయ్, రవి గౌడ్, ప్రభాకర్, రవీందర్, కొంకల మణికంఠ, విజయ్ శ్యాంసుందర్, బల్లరెడ్డి,సురేష్ వన్నాడ శివ,యాదగిరి ,అక్షయ్, వంశీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Image 1

పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు

Posted On 2026-03-14 13:05:35

Readmore >
Image 1

గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"

Posted On 2026-03-14 11:41:04

Readmore >
Image 1

పదవ తరగతి పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-03-14 11:10:04

Readmore >
Image 1

వెంకటాపూర్ శివారులో జూదం స్థావరం పై పోలీసుల దాడి

Posted On 2026-03-14 08:10:42

Readmore >
Image 1

సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు

Posted On 2026-03-13 22:52:56

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్‌లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్

Posted On 2026-03-13 19:19:09

Readmore >
Image 1

పదవ తరగతి వార్షిక పరీక్షలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

Posted On 2026-03-13 19:10:41

Readmore >
Image 1

ఏసీబీ కి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Posted On 2026-03-13 18:06:25

Readmore >
Image 1

రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి : ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం

Posted On 2026-03-13 17:42:24

Readmore >
Image 1

ఎల్.పి.జి గ్యాస్ కొరత లేదు : కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

Posted On 2026-03-13 17:35:18

Readmore >