Posted on 2023-10-26 17:17:09
డైలీ భారత్, శ్రీకాకుళం జిల్లా: చేప ముక్క, యాభై రూపాయల కోసం జరిగిన ఘర్షణలో ఓ నిండు ప్రాణం బలయిపోయింది. వినడానికి హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ ఇది నిజం. గొడవ జరగకుండా ఆపడానికి వెళ్లిన పెద్దమనిషి ప్రాణాలపైకి వచ్చిన సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... శ్రీకాకుళం జిల్లా, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి రెండో వార్డులోని సాయిబుల కోలనీలో మంగళవారం రాత్రి జరిగిన ఓ విచిత్ర సంఘటనలో నిండు ప్రాణం బలయ్యింది. సాయిబుల కాలనీలో పెయింటర్లుగా జీవనం సాగిస్తున్న ఇరువురు వ్యక్తులు కూలి డబ్బులు యాభై రూపాయలతో పాటు చేప ముక్క కోసం మంగళవారం రాత్రి గొడవపడ్డారు. అయితే సయ్యద్ ఖాదర్ అనే 70 ఏళ్ల వృద్ధుడు గొడవను ఆపే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు. గొడవకు దిగిన ఇరువురు మద్యం తాగి ఉండడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే ఖాదర్ పై ఓ స్టీల్ చెంబుతో షేక్ దాసు అనే వ్యక్తి తల, చాతీపై దాడి చేయడంతో మృత్యువాత పడినట్లు కాశిబుగ్గ పోలీసులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి ఇన్చార్జి సీఐ రవిప్రసాద్ తన సిబ్బందితో చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే వీరి మధ్య పాత తగాదాలకు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >