Posted on 2023-10-24 19:25:50
డైలీ భారత్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా సాయుధ ధళా కార్యాలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా శక్తికి రూపమైనటువంటి ఆయుధములకు ఆయుధ కర్మాగారం నందు, జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగి్ జీ. పాటిల్ ఐపిఎస్., గారు కుటుంబ సామెతంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి, పోలీసు వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.... జిల్లా పోలీసులుకు మరియు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపినారు. విజయదశమి ఉత్సవం విజయాలకు ప్రతీకగా అభివర్ణించారు. శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో ప్రతి ఆయుధానికి ఎంతో శక్తి కలిగి ఉంటుందని అలాంటి విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖలో ప్రతి స్థాయిలోని అధికారి ప్రజా రక్షణలో ముందుంటూ మన్ననలు అందుకుంటూ పోలీస్ శాఖ గౌరవం మరింత పెరిగేలా పని చేయాలన్నారు. పండగను అందరు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ముఖ్యంగా నవరాత్రులు పూజలందుకున్న దుర్గ మాత విగ్రహాల నిమజ్జనంను కూడా ప్రశాంత వాతావరణలో నిర్వహించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చెన్నయ్య, మహబూబాబాద్ డీఎస్పీ సత్యనారాయణ, తొర్రర్ డీఎస్పీ వెంకటేశ్వరా బాబు, డీఎస్పీ మోహన్, ఏఆర్ డీఎస్పీ విజయ్ ప్రతాప్, సీఐలు ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు..
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-02 17:42:33
Readmore >
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >