Posted on 2023-10-24 19:23:36
- నేలకొండపల్లి మండలంలో బీఆర్ఎస్ నేతలు పలువురి రాజీనామా
- పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక
డైలీ భారత్ , నేలకొండపల్లి : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ అసంతృప్తులంతా ఒక్కొక్కరిగా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఆ పార్టీలోని కొందరి నేతల అధిపత్య పోరు తమకు ఇబ్బందికరంగా ఉందని చెబుతూ... ఇందిరమ్మ రాజ్యం కోసం కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. పార్టీకి రాజీనామా చేసిన వారంతా పొంగులేటి శీనన్న వెంటే ఉంటామంటూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలానికి చెందిన మాజీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు తేజావత్ కోటేశ్వరరావు, వార్డు మెంబర్ భూక్య భారతి, ధీరావత్ శ్యామాలి, రాజారాం పేట పీఏసీఎస్ వైస్ చైర్మన్ ధీరావత్ బాలాజీ, గోబ్రియా, యూత్ నాయకులు వీరన్న, వంశీ తదితరులు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. అనంతరం ఖమ్మంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-02 17:42:33
Readmore >
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >