| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సు బీభత్సం

ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సు బీభత్సం

డైలీ భారత్, కాకినాడ: కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సు బీభత్సం సృష్టించింది. ఏలేశ్వరం నుంచి రాజమహేంద్రవరం 20 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు జగ్గంపేట కాంప్లెక్స్ కు వచ్చేసరికి బ్రేక్ ఫెయిల్ అయి కాంప్లెక్స్ లోకి దూసుకు వచ్చింది.

ఆర్టీసీ బస్సు క్లచ్ హార్ట్ అవ్వడం వల్ల బ్రేక్ ఫెయిల్ అయిందని డ్రైవర్ తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో వృద్ధురాలు కాలిపైకి ఆర్టీసీ బస్సు చక్రం ఎక్కడంతో ఆమె కాలు నుజ్జు నుజ్జు అయ్యింది. 

అదృష్టవశాత్తు ఇనపరైలింగ్ రాడ్లు ఉండటం వల్ల పెను ప్రమాదం తప్పింది. లేకపోతే ప్రమాద బాధితుల సంఖ్య పెరిగేది.

గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తరలించారు.

ఏదేమైనా గత మూడు రోజులుగా ఆర్టీసీ బస్సులు బీభత్సం సృష్టిస్తున్నాయి..

Previous ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ కమాండెంట్‌
Next ప్రభుత్వ టీచర్ దారుణ హత్య
ADVERTISEMENT