| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

త్వరితగతిన ధన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి-- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

త్వరితగతిన ధన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి-- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

డైలీ భారత్, మెదక్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళు తుది దశలో ఉన్నాయని వారం రోజుల్లో జిల్లాలో అన్నీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు పూర్తి చేసి మిల్లులకు తరలించటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్  తెలియజేశారు. 

ఈరోజు మెదక్ మండలంలోని ప్యాక్స్ మాచవరం పరిధిలోని చిట్యాల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ 


ఈ సీజన్లో చిట్యాల కొనుగోలు కేంద్రంలో 116 రైతుల నుండి 4735.60 క్వింటళ్ళ ధాన్యం కొనుగోలు చేయటం జరిగినదని ఈ కొనుగోలు కేంద్రం నందు మిగిలి ఉన్న ధాన్యాన్ని మూడు రోజుల్లో కొనుగోలు పూర్తి చేసి మరియు మిల్లులకు తరలింపు పూర్తి చేయాలని నిర్వహకులను ఆదేశించారు. 

గత యాసంగి సీజన్లో జిల్లాలో ఈరోజు నాటికి 1,78,374.760 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయటం జరిగింది మరియు 410 కొనుగోలు కేంద్రాలలో పదమూడు (13) కొనుగోలు కేంద్రాలలో మాత్రమే ధాన్యం కొనుగోలు పూర్తి చేసారు. కానీ ప్రస్తుతం జిల్లాలో మొత్తం 410 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు 2,53,336.240 మెట్రిక్ టన్నుల వరిధాన్యం 59091 రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి రూ.436.51 కోట్లు చెల్లించడం జరిగింది మరియు 235 కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు పూర్తి అయ్యిందని తెలిపారు. 

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు. 

జిల్లాలో మిగిలి ఉన్న ధాన్యాన్ని కూడా త్వరితగతిన కొనుగోలు పూర్తిచేసి మిల్లులకు తరలించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ వెంట. సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

Previous సరైన తేమశాతం ఉన్నప్పుడే ధాన్యాన్ని మిల్లులకు పంపాలి : అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
Next కుమారుడు మృతి చెందడంతో తండ్రి దశరథ కు ఆర్థిక సహాయం చేసిన స్నేహితులు
ADVERTISEMENT