Posted on 2024-05-28 20:46:54
డైలీ భారత్, మెదక్: శివంపేట మండలం చిన్నగొట్టుముక్కల గ్రామంలో ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో శివంపేట మండలం చిన్న గొట్టుముక్కల గ్రామంలో ఇందిరా క్రాంతి పదం ద్వారా చేపట్టిన కొనుగోలు కేంద్రాన్ని, నర్సాపూర్ వ్యవసాయ మార్కెట్ ను సంబంధిత అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు
ఈ సందర్భంగా కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు పలు సూచనలు చేస్తూ కొనుగోలు వేగవంతం చేయాలని తేమశాతం కరెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే అటువంటి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని చెప్పారు. రవాణా సంబంధిత విషయాల్లో లారీలు కొరతలేదని ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురావాలని అన్నారు.
కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని వెంటనే ఆరబోసి కూలీలతో ధాన్యాన్ని తిరగబోత ప్రక్రియ చేయడం ద్వారా అనుకున్న తేమ శాతం లభ్యమవుతుందని తద్వారా కొనుగోలు ప్రక్రియ సులభతరం అవుతుందని రైతుకు గిట్టుబాటు ధర అందుతుందనివివరించారు.
క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అధికారులు కొనుగోలు కేంద్రాల సమస్యల సమాచారాన్ని వాట్సాప్ ద్వారా తెలుసుకొని చర్యలు చేపడుతున్నామన్నారు
రైతులు అహర్నిశలు కష్టించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు కేంద్రం అధికారులు, మండల అగ్రికల్చర్ అధికారులు, మిల్లర్లు సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో శివంపేట తాసిల్దార్ శ్రీనివాసులు ,ఫ్యాక్ట్స్ సీఈఓ మధు ఇందిరా క్రాంతి పదం సిసి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >