Posted on 2024-05-27 22:10:43
డైలీ భారత్, మెదక్: జిల్లా జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పెద్దలకు టిబి వ్యాక్సినేషన్ కార్యక్రమ నిర్వహణపై జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులకు పర్యవేక్షణ అధికారులకు ఆశ నోడల్ పర్సన్ లకు టిబి నోడల్ పర్సన్ లకు ఎం ఎల్ హెచ్ పి లకు ఏర్పాటు చేసిన ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ గారు ప్రారంభించారు .
ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలోని పెద్దలకు ఉచితంగా బి సి జి వ్యాక్సినేషన్ కు వీలుగా అవసరమైన కార్యాచరణ చురుగ్గా సాగుతుందని ఇప్పటికే వివిధ స్థాయిలలోని శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, వెల్నెస్ కేంద్రాలు ,వ్యాక్సినేషన్ కేంద్రాలలో వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు .ఒక కుటుంబంలో 18 సంవత్సరముల వయసు దాటిన వారిని 60 సంవత్సరముల వయసు పైబడిన వారిని పొగ త్రాగే వారు , మధుమేహ వ్యాధితో బాధపడే వారిని గుర్తించనున్నారు .తక్కువ బరువు ఉన్నవారు, ఐదేళ్లలో క్షయ ఔషధాలు వాడిన వారిని ,క్షయరోగితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించనున్నారు .ఇలాంటి వారికి బీసీజీ టీకాను అందించాలని వైద్యశాఖ నిర్ణయించినది. ఇట్టి కార్యక్రమంలో డాక్టర్ స్నేహ శుక్ల డబ్ల్యూహెచ్వో కన్సల్టెంట్, డాక్టర్ భాను స్టేట్ టిబి కోఆర్డినేటర్ ,డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎస్ ఎం ఓ, డాక్టర్ విజయనిర్మల డిప్యూటీ డి ఎం హెచ్ ఓ నర్సాపూర్ ,డాక్టర్ అనిలా డిప్యూటీ డిఎంహెచ్వో మెదక్ ,డాక్టర్ అరుణ శ్రీ డిప్యూటీ డిఎంహెచ్వో తూప్రాన్ డాక్టర్ మాధురి జిల్లా ఎమినైజేషన్ అధికారిని, డాక్టర్ నవీన్ కుమార్ ప్రోగ్రాం ఆఫీసర్ ఫర్ టి బి, శ్రీనివాస్ డిప్యూటీ డెమో ,రమ హెల్త్ ఎడ్యుకేటర్ సునీల్ వివిధ పి హెచ్ సి వైద్య అధికారులు మరియు సూపర్వైజర్ లా స్టాప్ ఎం ఎల్ హెచ్ పి లు పాల్గొన్నారు
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >