డైలీ భారత్, వినుకొండ: వినుకొండ పట్టణంలోని 15వ వార్డు నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు తనయురాలు మణికుమారి వార్డు లో పర్యటించారు..
ప్రతి గడపకు వెళుతూ, ప్రతి ఒక్కరినీ అప్యాయంగా పలకరిస్తూ, వారి కుటుంబ లో ఒకరిగా వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ, వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి ని ప్రతి ఒక్కరికీ వివరిస్తూ, ప్రజల్లో ముందుకు సాగారు. ఇలాంటి అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే గా గెలవాలని, అందుకు మీ సహాయ సహాకారాలు ఓటు రూపంలో ఫ్యాన్ గుర్తు కు వేసి బ్రహ్మనాయుడు కి సహకరించాలని కోరారు....