Posted on 2024-04-13 14:20:49
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టి ఎస్ యు టి ఎఫ్) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల సిరిసిల్లలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రముఖ కవి, రచయిత జూకంటి జగన్నాథం మాట్లాడుతూ నేటితరం ఉపాధ్యాయుల్లో సామాజిక స్పృహ లోపించిందని, ఉపాధ్యాయులు అనునిత్యం విద్యార్థిగా ఉంటూ నిరంతరం అధ్యయనం చేయాలని, ప్రశ్నించే స్వభావాన్ని కలిగి ఉండాలని సామాజిక స్పృహ కలిగి ఉండాలని అన్నారు. గత దశాబ్ద కాలంలో ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలలను మినీ గురుకులాలుగా అప్గ్రేడ్ చేయాలని అన్నారు. సమాజంలో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంచడంలో సామాజిక స్పృహా కలిగించడంలో సామాజిక సేవలో టీఎస్ యుటిఎఫ్ ముందు వరుసలో ఉందని అన్నారు.
రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ శ్రీధర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడుతూ, బాధ్యతాయుతంగా మెలుగుతూ ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ కోసం టీఎస్ యుటిఎఫ్ ఏండ్లుగా కృషి చేస్తుందని అన్నారు. కార్మికుల,కర్షకుల పక్షాన టీఎస్ యుటిఎఫ్ నిరంతరం పోరాడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి గుండమనేని మహేందర్ రావు, ఉపాధ్యక్షులు అంబటి రమేష్, కోశాధికారి పర్కాల రవీందర్, జిల్లా కార్యదర్శులు జంగిటి రాజు, ఆడేపు శివకుమార్, పాముల స్వామి గౌడ్, లక్ష్మణ్, కోత్వాల్ ప్రవీణ్ పాల్గొన్నారు. తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షులు, కవి, గాయకులు వెంగళి నాగరాజు పాల్గొన్నారు.
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >