| Daily భారత్
Logo




భర్తను చంపేందుకు.. కి’లేడి’ పక్కా ప్లాన్

News

Posted on 2024-04-13 14:02:54

Share: Share


భర్తను చంపేందుకు.. కి’లేడి’ పక్కా ప్లాన్

భర్తలు జర జాగ్రత్తగా ఉండాలి అయితే...భర్తను చంపేందుకు.. కి’లేడి’ పక్కా ప్లాన్.. బంపర్ ఆఫర్ కొట్టేద్దామనుకుంటే  పోలీసులు రాకతో భారీ షాక్..

డైలీ భారత్, కడప: వివాహేతర సంబంధానికి అలవాటు పడిన మాధవి అనే మహిళ తన భర్త రాంబాబును ప్రియుడు భరత్‎తో కలిసి హత్య చేసింది. 

భరత్‎తో తనకున్న వివాహేతర సంబంధం భర్త రాంబాబుకు తెలిసిపోవడం.. రాంబాబు రోజు మాధవిని చిత్రహింసలకు గురిచేస్తుండడంతో ప్రియుడితో కలిసి భర్తను చంపడానికి పక్కా స్కెచ్ గీసింది. 

భర్తను చంపాలని నిర్ణయించుకున్న తర్వాత రాంబాబు‎పై రూ.20 లక్షల రూపాయలకు ఇన్సూరెన్స్ కూడా చేయించింది.

ఈ క్రమంలో మాధవి తన తల్లి సపోర్టు కూడా తీసుకొని మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి రాంబాబును హత్య చేసింది. 

అయితే దీనంతటిని ఆక్సిడెంట్‎గా చిత్రీకరించి పోలీసులను నమ్మించే ప్రయత్నం చేయసింది.

కానీ పోలీసులు మాధవి తీరుపై అనుమానం రావడంతో కేసును పూర్తిగా దర్యాప్తు చేయగా అసలు హంతకురాలు భార్యేనని పోలీసులు తేల్చారు.

ఆమెకు ప్రియుడు భరత్, మాధవి తల్లి కూడా సహకరించారని వారితో పాటు మరో ముగ్గురు వ్యక్తుల సహాయం తీసుకొని భర్తను యాక్సిడెంట్ చేయించి చంపించిందని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు.

కిలాడీ లేడి చేసిన హత్యపై జమ్మలమడుగు డీఎస్పీ యశ్వంత్ మాట్లాడుతూ..

వివాహేతర సంబంధంతో రాంబాబు అనే వ్యక్తిని భార్యే హత్య చేసిందని, చంపేముందు భర్తపేరుపై రూ.20లక్షల ఇన్సూరెన్స్ చేయించిందన్నారు.

 హత్యకు ఆమె తల్లి, ఆమె ప్రియుడు మరో ముగ్గురు వ్యక్తులు సహకరించారని డీఎస్పీ తెలిపారు. 

మృతుడు ఎర్రగుంట్ల పట్టణంలోని ప్రశాంతి నగర్ నివాసం ఉంటున్నాడని, గత రెండు సంవత్సరాలుగా మృతుని భార్య మాధవితో భరత్ బాబు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న రాంబాబు భార్యను మానసికంగా వేధింపులకు గురిచేస్తుండటంతో భార్య మాధవి ఆమె తల్లి కలిసి రాంబాబును అడ్డు తొలగించుకోవాలని పధకం ప్రకారం రాంబాబును హత్య చేసినట్లు వివరించారు. 

ఎర్రగుంట్ల మండలం నిడిజివ్వి దగ్గర ప్రమాదవశాత్తు చనిపోయినట్లు చిత్రీకరించారని.. నిందుతులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >