డైలీ భారత్, తంగళ్లపల్లి: కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువ భారత్ (MY భారత్), రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలో నషా ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 10-10-2026 న నిర్వహించగా 130 మంది యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.
నాలుగు సెషన్లుగా అవగాహన:
కార్యక్రమం నాలుగు సెషన్లుగా సాగింది.
1. MY భారత్ పోర్టల్: పోర్టల్ లక్ష్యాలు, ఫీచర్లు, యువతకు లభించే అవకాశాలపై అవగాహన కల్పించారు.
2. "మాదకద్రవ్య దుర్వినియోగాన్ని అర్థం చేసుకోవడం": దుర్వినియోగానికి కారణాలు, పరిణామాలు, వ్యసనాల రకాలు, శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం, కుటుంబం, సమాజం, వికసిత భారత్‌పై దాని ప్రభావాలను వివరించారు.
3. "అవగాహన నుండి ఆచరణ వరకు": ప్రతిజ్ఞ, సమూహ చర్చలు, కేస్ స్టడీలు, క్విజ్‌లు, రోల్-ప్లేల ద్వారా ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు.
4. "మార్పు కథలు": మాదకద్రవ్య ప్రభావం, పునరావాస ప్రయాణాలు, యువత జోక్యాలపై లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు ప్రదర్శించారు.
ముగింపులో పాల్గొన్న యువత అందరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, నషా ముక్త్ భారత్ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమానికి సైకాలజిస్ట్ పున్నంచందర్ కనుకుంట్ల, MY భారత్ వలంటీర్ లోపెల్లి రాజు హాజరై యువతకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం MY భారత్, NYK ఉమ్మడి జిల్లా యువజన అధికారి గోలి తిరుపతి రెడ్డి పర్యవేక్షణలో జరిగింది.