| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బీసీలకు మొండిచేయి చూపెడుతున్న ప్రధాన పార్టీలు

బీసీలకు మొండిచేయి చూపెడుతున్న ప్రధాన పార్టీలు

బీసీలకు టికెట్లు కేటాయించాలని బీసీ విద్యార్థి సంఘం నాయకుడు డిమాండ్

డైలీ భారత్ సిరిసిల్ల : ఈరోజు బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం బీసీ భవన్ లో విలేకరుల సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ బిజెపి పార్టీలు బీసీలకు జనాభా ప్రాతిపదికన ప్రకారం టిక్కెట్లు ఇవ్వాల్సిందే అని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు టిక్కెట్ కేటాయింపులు బీసీలకు సరైన ప్రాతినిధ్యం కలిగించకపోతే బీసీల ఓట్లు అడిగే హక్కు ఆ పార్టీలు కోల్పోతారని ఎలా అడుగుతారని ప్రశ్నించారు టిఆర్ఎస్ పార్టీ లాగానే బీసీలకు తగిన సీట్లు ఇవ్వకుండా మోసం చేశారని ఏ పార్టీ అయినా బీసీలకు తాగిన న్యాయం టికెట్ విషయంలో న్యాయం జరగాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ లో డిక్లేషన్ ప్రకారం బీసీలకు 34 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తామని చెప్పినా కాంగ్రెస్ పార్టీ దానికి పూర్తిగా కట్టుబడి ఉండాలని అన్నారు బిజెపి పార్టీ బీసీలకు టికెట్ విషయంలో బీసీల జనాభా ప్రకారం అసెంబ్లీ సీట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు బీసీలు 50 శాతం ఉన్న బీసీలకు ముఖ్యమంత్రి పదవి ప్రధాన పార్టీలు ప్రకటించాలని అన్ని పార్టీలను డిమాండ్ చేస్తున్నాం లేకపోతే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు గౌరీ రాకేష్ ముదిరాజ్ లక్ష్మణ్ ధనుష్ స్వామి నవీన్ రాము తరుణ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Previous మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సిరిసిల్ల మున్నూరు కాపుల నిరసన
Next సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
ADVERTISEMENT