| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాజమండ్రి దగ్గర AE కుటుంబం ఆత్మహత్యాయత్నం...

రాజమండ్రి దగ్గర AE కుటుంబం ఆత్మహత్యాయత్నం...

పవన్ కళ్యాణ్ విచారం...

NDRFతో గాలింపు ఆదేశం... 

డైలీ భారత్, రాజమహేంద్రవరం:రాజమహేంద్రవరం సమీపంలో పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజీనియర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. 

ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు... 

గాలింపు ముమ్మరం: 

గల్లంతైన కుటుంబ సభ్యుల కోసం వెంటనే గాలింపు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అవసరమైతే NDRF, SDRF బృందాలను రంగంలోకి దింపాలని సూచించారు.

సమగ్ర విచారణ: తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల SPలతో మాట్లాడి ఈ ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపై లోతుగా విచారణ జరపాలని చెప్పారు.

కఠిన చర్యలు: విచారణలో ఎవరైనా బాధ్యులుగా తేలితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

వైద్య సాయం: ఈ ఘటన నుంచి బయటపడిన శ్రీ నూకరాజు గారి మనుమడికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు ఆదేశించారు.

ప్రజలకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి

ఈ సందర్భంగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. "ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. క్షణికావేశంలో, మానసిక ఒత్తిడిలో పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. బెదిరింపులు, వేధింపులు ఉంటే వెంటనే పోలీసులను, సంబంధిత అధికారులను ఆశ్రయించండి. ప్రాణం అమూల్యమైనది" అని అన్నారు.

ప్రస్తుతం పోలీసులు, రెస్క్యూ బృందాలు గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

#PawanKalyan #Rajamahendravaram #PanchayatRaj #AndhraPradesh #BreakingNews

Previous రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం
Next బీహార్ : ప్రముఖ ఆలయంలో తొక్కిసలాట... ఏడుగురు భక్తులు మృతి
ADVERTISEMENT