| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సిరిసిల్ల మున్నూరు కాపుల నిరసన

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సిరిసిల్ల మున్నూరు కాపుల నిరసన

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల :మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పై టి.పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా సిరిసిల్లలోని మున్నూరు కాపు నేతలు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ బిడ్డ అయిన పొన్నాల  లక్ష్మయ్య పై ఇలాంటి వ్యాఖ్యలు తగదని రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డిని తెలంగాణలో తీరగనీయకుండా చేస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి పొన్నాల లక్ష్మయ్య కున్న రాజకీయ అనుభవం లేదని, పొన్నాల లక్ష్మయ్య ను విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డిది కాదని మండిపడ్డారు. పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారని దాన్ని గుర్తించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు. కేవలం బీసీల పట్ల చిన్న చూపు తోనే రేవంత్ రెడ్డి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశాడని అన్నారు. రానున్న రోజుల్లో ఓట్ల ద్వారానే రేవంత్ రెడ్డికి సమాధానం చెబుదామని అన్నారు ఈ కార్యక్రమంలో హాడక్ కమిటి కన్వీనర్ అగ్గి రాములు,ఆకుల కృష్ణ, కల్లూరి రాజు, కల్లూరి మధు, హాడక్ కమిటి సభ్యులు మున్నూరు కాపు సభ్యులు పాల్గొన్నారు.


Previous నేటి నుంచే పూల సంబురం.. ఎంగిలి పూల బతుకమ్మతో పండుగ ప్రారంభం.
Next బీసీలకు మొండిచేయి చూపెడుతున్న ప్రధాన పార్టీలు
ADVERTISEMENT