| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి : బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి

ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి : బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి

డైలీ భారత్, సిరిసిల్ల టౌన్: ఈరోజు స్థానిక 27 వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి అధ్యక్షతన బిఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం ను నిర్వహించి ఈనెల 17వ తేదీన  సిరిసిల్ల పట్టణంలో సీఎం కేసిఆర్   ముఖ్య అతిథులుగా  పాల్గొననున్న సిరిసిల్ల నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద  సభను విజయవంతం చేయాలని సీఎం కెసిఆర్ మరియు  మంత్రి కేటీఆర్ సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దెల చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన  అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిన సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తూ క్షేత్రస్థాయిలో ప్రజల్లో చైతన్యం కలిగించి భారీ సంఖ్యలో ప్రజలు ఈనెల 17న సిరిసిల్ల మొదటి బైపాస్ రోడ్డు సమీపంలో నిర్వహించే BRS పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం స్థాయి ప్రజా ఆశీర్వాద  సభలో పాల్గొనేలా ప్రజలకు సహాయ సహకారాలు అందించి సభను విజయవంతం చేసేలా కృషి చేయాలని ఈ సిరిసిల్ల నియోజకవర్గం ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ పట్ల కృతజ్ఞతలు వ్యక్తపరచుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమాలలో  బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ ఉపాధ్యక్షులు ఎండి సత్తర్ గారు, కార్యదర్శి మ్యాన రవి, యువజన విభాగం అధ్యక్షులు సుంకపాక మనోజ్, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు చంద్ పాష , వార్డు అధ్యక్షులు కాసర్ల మహేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి,  బూత్ కమిటీ సభ్యులు మొదలగు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఎండి మునీర్, కత్తెర వరుణ్ , సామల శ్రీనివాస్, పంగ మధు, శ్రీధర్ , వడ్నాల విక్రం, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Previous కొండగట్టు అంజన్న సన్నిధి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రచారం
Next ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు
ADVERTISEMENT