| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రైలులో పురుడు పోసుకున్న మహిళ

రైలులో పురుడు పోసుకున్న మహిళ

డైలీ భారత్ ,తాడేపల్లిగూడెం: ఎర్నాకులం జంక్షన్ టు హటాయి వెళుతున్న దర్తి అబ్బా ఎక్స్ప్రెస్ లో పురుడు పోసుకున్న మహిళ. 3టైర్ A/C లో B13 లో  రశ్మిత (23) కోయంబత్తూర్ నుండి బాలంగిరి  ప్రయాణం చేస్తున్న క్రమంలో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ సమీప ప్రాంతంలో పురుడు పోసుకున్న మహిళ. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. భర్త సుశాంత్ తో రశ్మిత పురిటి కోసం పుట్టింటికి వెళుతూ రైలులోనే పురుడు పోసుకున్న సంఘటన తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో  చోటుచేసుకుంది. వెంటనే చైన్ లాగి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చిన భర్త మరియు టి సి. అప్రమత్తమైన రైల్వే అధికారులు 108కు సమాచారం అందించడంతో పైలట్ నీలిపాల దినేష్, ఈ ఎన్ టి అనూష రైల్వే స్టేషన్ కి చేరుకొని రస్మితకు ప్రథమ చికిత్స చేసి తదనంతరం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తక్షణమే స్పందించిన వైద్యులు ఏరియా ఆసుపత్రి అవసరమైన అన్ని చికిత్సలు అందించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు సుశాంత్ తెలియజేశారు. 

Previous గవర్నరు అంటే రబ్బర్ స్టాంపా : తమిళ్ సై
Next ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి : కో - ఆర్డినేటర్ జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ
ADVERTISEMENT