| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎన్నికలవేళ అధికారుల బదిలీలు

ఎన్నికలవేళ అధికారుల బదిలీలు

డైలీ భారత్, న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో కొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌లను బదిలీ చేసింది.

విధి నిర్వహణలో అలసత్వం, పేలవమైన పనితీరు కలిగిన అధికారులపై ప్రతిపక్షాల ఫిర్యాదులతో ఈసీ ఈ మేరకు యాక్షన్ తీసుకుంది.

ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలోని సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన పోలింగ్ కేంద్రాలపై ఉన్నతాధికారులతో బుధవారం సాయంత్రం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ సీఈసీ,రాజీవ్ కుమార్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.

బదిలీ అయిన ఆఫీసర్ల జాబితాలో 9 మంది జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా మేజిస్ట్రేట్లతో పాటు 25 మంది పోలీసు కమిషనర్లు, పోలీసు సూపరింటెండెంట్లు, అదనపు ఎస్పీలు ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని రత్లాం, ఖర్గోన్ జిల్లాల కలెక్టర్లు, రాజస్థాన్ లోని ఆల్వార్ జిల్లా కలెక్టర్, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్, బిలాస్‌పూర్ కలెక్టర్లను ఈసీ బదిలీ చేసింది.

బదిలీ అయిన మొత్తం 25 మంది సీపీలు,ఎస్పీలు అడిషనల్ ఎస్పీలలో తెలంగాణ నుంచి 13 మంది ఉండటం గమనార్హం.

ఈ జాబితాలో హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌, నిజామాబాద్ సీపీ సత్యనారాయణ, వరంగల్ సీపీ రంగనాథ్‌ కూడా ఉన్నారు. ఇక రంగారెడ్డి కలెక్టర్ హరీష్‌, మేడ్చల్‌ కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, యాదాద్రి కలెక్టర్‌ కృష్ణారెడ్డి, నిర్మల్‌ కలెక్టర్‌ వరుణ్ రెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది.

ఈక్రమంలోనే ఎక్సైజ్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌తో పాటు రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌రాజ్‌ను సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ ట్రాన్స్‌ఫర్ చేసింది. తెలంగాణలో అనేక మంది నాన్-క్యాడర్ అధికారులకు జిల్లా ఎన్నికల ఇంఛార్జి పదవులను కట్టబెట్టి.. అడ్మినిస్ట్రేటివ్, పోలీసు సేవలకు చెందిన అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత లేని పోస్టులలో కొనసాగిస్తోందని ఈసీ ఆవేదన వ్యక్తం చేసింది.

మధ్యప్రదేశ్ నుంచి ఇద్దరు పోలీసు కమిషనర్లు బల్‌పూర్, భింద్, ముగ్గురు ఎస్పీల (కోర్బా, రాజ్‌నంద్‌గావ్, దుర్గ్)ను బదిలీ చేశారు. ఛత్తీస్‌గఢ్ నుంచి ఇద్దరు అదనపు ఎస్పీలు,బిలాస్‌పూర్, దుర్గ్ , మిజోరం నుంచి ఇద్దరు ఎస్పీలు (చంఫై & సైహా) , రాజస్థాన్ నుంచి ముగ్గురు ఎస్పీల హనుమాన్‌గఢ్, చురు, భివాడి,ను ఎన్నికల సంఘం బదిలీ చేసింది...

Previous ఎన్నికల ప్రవర్తన నియమావళికి తెలంగాణ సాంస్కృతిక సారథులు కట్టుబడి ఉండాలి
Next తెలంగాణ రాష్ట్ర దళితులకు ఊహించని షాక్
ADVERTISEMENT