| Daily భారత్
Logo




అంగన్‌వాడీ పౌష్టికాహారంలో పాము కళేబరం

News

Posted on 2023-10-11 07:50:40

Share: Share


అంగన్‌వాడీ పౌష్టికాహారంలో పాము కళేబరం

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో ఘటన

పౌష్టికాహారం ప్యాకెట్‌ను ఇంట్లో విప్పి చూస్తే పాము కళేబరం కనిపించడంతో గర్భిణికి షాక్

అంగన్‌వాడీ సూపర్‌వైజర్ సాయంతో సీడీపీఓకు బాధితురాలి ఫిర్యాదు

ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారమిచ్చామన్న సీడీపీఓ

బాధితురాలికి మరో ప్యాకెట్ ఇవ్వాలంటూ గుత్తేదారును ఆదేశించామని వెల్లడి

డైలీ భారత్, చిత్తూరు జిల్లా:  అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పంపిణీ చేసే పౌష్టికాహారం ప్యాకెట్లో పాము కళేబరం కనిపించడం చిత్తూరు జిల్లాలో కలకలానికి దారితీసింది. బంగారుపాళ్యం మండలం జంబువారిపల్లె పంచాయతీ శాంతినగర్‌లోని అంగన్ వాడీ కేంద్రంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. 

మానస అనే గర్భిణి..ఆ అంగన్‌వాడీ కేంద్రంలో ఇచ్చిన ప్యాకెట్ తీసుకుని శ్రీమంతం నిర్వహించుకునేందుకు తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ ఖర్జూరాల ప్యాకెట్ విప్పి చూడగా అందులో పాము కళేబరం కనిపించింది. ఈ దృశ్యంతో అవాక్కైన మహిళ అంగన్‌వాడీ సూపర్‌వైజర్ రెడ్డి కల్యాణి సాయంతో సీడీపీఓ వాణిశ్రీదేవికి సమాచారం అందించింది. కాగా, ప్యాకెట్లో పాము కళేబరం ఉన్న మాట వాస్తవమేనని సీడీపీఓ అంగీకరించారు. ఈ ఘటన గురించి ఉన్నతాధికారులకు చెప్పామని, మానసకు మరో ప్యాకెట్ ఇవ్వాల్సిందిగా గుత్తేదారును ఆదేశించామని పేర్కొన్నారు.

Image 1

రాజమండ్రి దగ్గర AE కుటుంబం ఆత్మహత్యాయత్నం...

Posted On 2026-08-17 08:06:58

Readmore >
Image 1

రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం

Posted On 2026-08-15 18:03:53

Readmore >
Image 1

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

Posted On 2026-08-15 17:53:10

Readmore >
Image 1

16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust

Posted On 2026-08-15 17:50:48

Readmore >
Image 1

గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్‌కు డిజిటల్ పరికరాలు

Posted On 2026-08-15 17:49:14

Readmore >
Image 1

సాయి ఎక్సలెంట్ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 16:56:59

Readmore >
Image 1

విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు

Posted On 2026-08-15 16:55:47

Readmore >
Image 1

మూడు ప్రాంతాల్లో ఫ్రీజర్‌ బాక్సుల పంపిణీ

Posted On 2026-08-15 16:54:31

Readmore >
Image 1

స్వాతంత్ర్య స్ఫూర్తితో దేశాభివృద్ధికి కృషి చేయాలి

Posted On 2026-08-15 16:53:32

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 13:43:20

Readmore >