Posted on 2024-02-26 15:22:36
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా బ్యూరో :తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా టియుడబ్ల్యూజీ (ఐజేయు) జాతీయ అధ్యక్షులు, సీనియర్ సంపాదకుడు కే శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల హక్కులు సంక్షేమం కోసం దశాబ్దాల పాటు పోరాటం చేసిన వ్యక్తికి మీడియా అకాడమీ చైర్మన్ పదవి ఇవ్వడంతో సంపూర్ణ న్యాయం జరుగుతుందని జర్నలిస్టు సమాజం విశ్వాసం వ్యక్తం చేస్తుంది. 1996లో ప్రెస్ అకాడమీ ఏర్పడగా మొదటి చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన ఆయన మరో మారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మీడియా అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
విషయం తెలిసిన వెంటనే టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్ (పేపర్ శ్రీను) పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా గుడిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తికి మీడియా అకాడమీ చైర్మన్ రావడం శుభ సూచికం అన్నారు. కె శ్రీనివాస రెడ్డి హయాంలో సంపూర్ణ న్యాయం జరుగుతుందని తెలంగాణ జర్నలిస్టులు పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జర్నలిస్టుల స్థితిగతులు మారతాయని ఆకాంక్షించిన జర్నలిస్టులకు అనుకున్న మేర న్యాయం జరగలేదన్నారు.ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే ( ఐజేయు )
రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ ,రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, చైర్మన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >
వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్
Posted On 2026-08-24 14:24:34
Readmore >
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి
Posted On 2026-08-24 14:16:01
Readmore >
డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-24 14:10:44
Readmore >
జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎన్‌సీఎస్‌టీ సభ్యుడు జాతోత్ హుస్సేన్‌కు కలెక్టర్ అంకిత్ ఘన స్వాగతం
Posted On 2026-08-24 14:09:34
Readmore >