Posted on 2026-07-12 17:19:03
డైలీ భారత్, సిరిసిల్ల: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్ శక్తి అభియాన్ – JSJB 3.0 లో భాగంగా "క్యాచ్ ది రైన్" నెలరోజుల ప్రత్యేక ప్రచారం 06.07.2026 నుండి 05.08.2026 వరకు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా సిరిసిల్ల పట్టణంలో నేడు వర్షపు నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి వేణు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంచాల్సిన అవసరం, నీటి పొదుపు ప్రాముఖ్యత గురించి అధికారులు వివరించారు. ప్రతి ఇంట్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు చేపట్టాలని కోరారు.
కార్యక్రమం ముగింపులో నీటి వనరులను కాపాడతామని, వర్షపు నీటి సంరక్షణను అమలు చేస్తామని అందరూ జల సంరక్షణ ప్రతిజ్ఞ చేశారు.
మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, "నీరు లేకుంటే భవిష్యత్తు లేదు. ప్రతి ఒక్కరూ "క్యాచ్ ది రైన్" లో భాగస్వాములు కావాలి" అని పిలుపునిచ్చారు.
#CatchTheRain #JalShaktiAbhiyan #Sircilla
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >