Posted on 2026-07-10 17:31:57
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి మంచి స్థాయికి చేరుకోవాలని భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త సూచించారు. శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రముఖ వ్యాపారవేత్త కే.మదన్ కుమార్ గుప్త ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే భవిష్యత్ ఉజ్వలమవుతుందన్నారు.దాతలు ఇస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా దాతల సేవలను ఆయన కొనియాడారు. భవిష్యత్తులో కూడా గ్రామానికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని వారిని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాములు నాయక్, ఉప సర్పంచ్ మల్లేష్ నాయక్, వార్డు సభ్యులు ప్రశాంత్, అరుణ కుమారి యాదయ్య, గ్రామసెక్రటరీ నరేష్, ప్రధానోపాధ్యాయులు శ్రీలత,ఉపాధ్యాయులు ఆల్బర్ట్, రవి, ఈశ్వరి మరియు గ్రామ నాయకులు నర్సింలు, శ్రీశైలం, శ్రీనివాస్ గౌడ్, సత్యం,రమేష్ గ్రామస్థులు పాల్గొన్నారు.
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >