Posted on 2026-07-10 18:24:01
డైలీ భారత్, కామారెడ్డి, పిట్లం:డయల్-100కు అందిిన సమాచారంతో పోలీసులు అత్యంత వేగంగా స్పందించి ఒక మహిళ ప్రాణాలను నిలబెట్టారు.
పిట్లం పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక రామాలయం చెరువులో గురువారం సాయంత్రం 7:00 గంటలకు ఒక మహిళ ఆత్మహత్య చేసుకునేందుకు దూకిందని డయల్-100కు ఫోన్ వచ్చింది.
సమాచారం అందిన వెంటనే పిట్లం ఎస్‌ఐ ఆంజనేయులు తన సిబ్బంది నవీన్, నదీమ్, చంద్రయ్యతో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. పిట్లం సర్పంచ్ చంద్రశేఖర్ మరియు గజ ఈతగాళ్లు గున్నింగి సాయిలు, అబ్బుగాని లచ్చయ్య సహకారంతో చెరువులో ఉన్న మహిళను సురక్షితంగా బయటకు తీశారు.
అనంతరం 108 అంబులెన్స్ ద్వారా ఆమెను చికిత్స నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాల కారణంగా ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ, "డయల్-100కు వచ్చే ప్రతి అత్యవసర సమాచారంపై పోలీసులు వేగంగా స్పందిస్తాం. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు మేము కట్టుబడి ఉన్నాం. ఎవరూ ఆత్మహత్య వంటి నిర్ణయాలు తీసుకోవద్దు" అని తెలిపారు.
ప్రాణాలు కాపాడిన ఎస్‌ఐ, సిబ్బంది, సర్పంచ్ మరియు గజ ఈతగాళ్లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
#Kamareddy #Pitlam #Dial100 #TelanganaPolice #BreakingNews
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >