Posted on 2026-07-10 17:13:30
డైలీ భారత్, జంగారెడ్డిగూడెం: బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లో పనిచేస్తున్న గోల్డ్ అప్రైజర్ వినియోగదారుల బంగారాన్ని కాజేసి నకిలీ ఆభరణాలు పెట్టిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది.
బ్యాంకులో కస్టమర్లు రుణాలకు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను ఆరోపితుడు స్వాధీనం చేసుకుని, వాటికి బదులుగా నకిలీ నగలు, ఇతర వస్తువులను ఉంచినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ క్రమంలో మొత్తం 6.449 కిలోల బంగారం, విలువ సుమారు ₹10 కోట్లు అపహరణకు గురైనట్లు పోలీసులు గుర్తించారు.
అపహరించిన బంగారాన్ని జంగారెడ్డిగూడెంలోని వివిధ జ్యువెలరీ షాపుల్లో తన పేరుతో, తల్లిదండ్రుల పేరుతో తిరిగి తాకట్టు పెట్టి, కొంత విక్రయించినట్లు తేలింది.
సమాచారం అందుకున్న ఏపీ పోలీసులు రంగంలోకి దిగి ఆరోపితుడిని అరెస్టు చేశారు. వివిధ జ్యువెలరీ షాపుల్లో సోదాలు నిర్వహించి ₹10 లక్షల నగదు, 4.120 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన నగదు, బంగారం మొత్తం విలువ సుమారు ₹5.81 కోట్లుగా అంచనా.
ఈ కేసును త్వరితగతిన ఛేదించిన దర్యాప్తు బృందాన్ని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ అభినందించారు. అధికారుల వృత్తి నైపుణ్యం, అంకితభావాన్ని కొనియాడిన ఆయన, ఇదే స్థాయిలో నిఘా, నిజాయితీతో నేరాలను అరికట్టాలని సూచించారు.
ప్రస్తుతం పోలీసులు మిగిలిన బంగారం ఆచూకీ కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >