Posted on 2026-07-10 16:18:06
డైలీ భారత్, కామారెడ్డి: జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలు, దాబాల్లో సిట్టింగులపై కామారెడ్డి జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించే ఇటువంటి అక్రమ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, IPS స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో పిట్లం పోలీస్ స్టేషన్ పరిధిలోని పిట్లం గ్రామ శివారులో ఉన్న దుర్గ భవాని (సంతు) దాబా యజమాని రాథోడ్ సంతోష్ పై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
గతంలో 30-08-2025న దాబాలో అనుమతి లేకుండా మద్యం విక్రయాలు, సిట్టింగులు నిర్వహించినందుకు రూ.50,000 బైండోవర్ ఇచ్చారు. అయినప్పటికీ 17-05-2026న మళ్లీ అక్రమ సిట్టింగులు నిర్వహిస్తున్నట్లు గుర్తించి పోలీసులు దాడి చేశారు.
బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 10-07-2026న పిట్లం ఎస్‌ఐ ఆంజనేయులు ఎమ్మార్వో సమక్షంలో రాథోడ్ సంతోష్‌పై రూ.15,000 జరిమానా విధించడంతో పాటు రూ.1,00,000 కు మళ్లీ బైండోవర్ చేయించారు.
"జిల్లాలోని ఏ దాబాలోనైనా అక్రమ కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు తప్పవు. బైండోవర్ తర్వాత ఉల్లంఘిస్తే కేసులు కూడా నమోదు చేస్తాం" అని ఎస్పీ హెచ్చరించారు.
#Kamareddy #Pitlam #DailyBharatKamareddy #TelanganaPolice #KamareddySP #RajeshChandraIPS #Bindover #IllegalLiquor #DhabaRaid #PitlamSI #LawAndOrder #TelanganaNews #KamareddyNews
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >