| Daily భారత్
Logo




దడ పుట్టిస్తున్న థార్‌ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...

News

Posted on 2026-06-19 07:44:35

Share: Share


దడ పుట్టిస్తున్న థార్‌ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...

డైలీ భారత్, చీరాల: మధ్యప్రదేశ్‌కు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా కదలికలపై ప్రకాశం, ఏలూరు జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ధార్ జిల్లాకు చెందిన నిందితుల ముఠా రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు సమాచారం అందడంతో పలు ప్రాంతాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. చీరాలలో గతంలో చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్న ముఠాలతో ఈ గ్యాంగ్‌కు సంబంధాలు ఉండొచ్చన్న అనుమానంతో స్థానిక నేరస్థుల కదలికలపైనా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ చీరాల టూ టౌన్ సీఐ శశికుమార్ అనుమానితుల ఫొటోలతో పోస్టర్లను విడుదల చేశారు. పోస్టర్లలో ఉన్న వ్యక్తులు చోరీలు, దోపిడీ కేసుల్లో నిందితులని, వారి ఆచూకీ తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

పర్చూరులోనూ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పర్చూరు ఎస్‌ఐ పులి గోపి మాట్లాడుతూ, ధార్ గ్యాంగ్ కదలికలపై రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తత కొనసాగుతోందని తెలిపారు. ఏలూరు రైల్వే స్టేషన్ పరిసరాల్లో ముగ్గురు అనుమానితుల కదలికలు సీసీ కెమెరాల్లో నమోదైనట్లు చెప్పారు. గ్రామాలు, పట్టణాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ప్రజల సహకారంతో ఈ ముఠా కదలికలను గుర్తించి నేరాలను అరికట్టేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు

Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >