| Daily భారత్
Logo




"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు

News

Posted on 2026-06-19 08:33:46

Share: Share


"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు

సిరిసిల్ల రాజకీయాలను టిఆర్ఎస్ ప్రభావం చేయనుందా..

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల నియోజకవర్గం ఏర్పడిన నాటినుండి అటు రాజకీయ పార్టీలకు జవసత్వాలను అందించి ఆ రాజకీయ పార్టీల భవిష్యత్తు బాటలు వేసింది. ఉమ్మడి రాష్ట్రం లో కమ్యూనిస్టు, కాంగ్రెస్, టిడిపి, అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి కి సిరిసిల్ల రాజకీయ భవిష్యత్తు అందిస్తూ వస్తుంది. ఎన్నో రాజకీయ పరిణామాలకు సిరిసిల్ల వేదిక గా నిలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు వెన్నంటే సిరిసిల్ల ప్రజలు నడుస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతూ వస్తున్నారు. పరిస్థితులు కూడా అవే రుజువు చేస్తున్నట్లు కనిపిస్తుంది.

అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలు కొత్త రాజకీయ మార్పులకు, మలుపులకు, వేదిక కాబోతున్నాయా  అన్న అంశం తీవ్రంగా చర్చనీయాంశంగా మారుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల అనుహ్యామైన మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మారిన అనంతరం ఆ పార్టీలు చోటుచేసుకున్న పరిణామాలు మూలంగ కవిత ఆ పార్టీకి దూరం కావాల్సి వచ్చింది. రాజకీయాల్లో కెసిఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నదాని కవిత గురించి రాజకీయ పరిశీలకు చెబుతుంటారు. కవిత తెలంగాణ రాష్ట్ర సమితిలో కొనసాగుతున్న కాలంలోనే "తెలంగాణ జాగృతి"ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ రాజకీయలలో ప్రత్యేక ముద్ర వేస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా "తెలంగాణ జాగృతి " ద్వారా పలువురు అభ్యర్థులను బలపరిచి రాజకీయ సమీకరణలపై ఆమె ప్రభావం చూపినట్లు రాజకీయ పరిశీలకు చెబుతున్నారు. 

అనూహ్యంగా ప్రత్యక్షంగా తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పుతూ తన ప్రత్యేక ముద్రను తెలంగాణ రాజకీయాల్లో చూపించాలని భావిస్తూన్న కవిత ఆధ్వర్యంలో "తెలంగాణ రాష్ట్ర సేన" ఏర్పాటు పై రాజకీయ పార్టీలు భిన్న అభిప్రాయాలు లను వ్యక్తం చేసిన రాష్ట్ర రాజకీయాల్లో "తెలంగాణ రాష్ట్ర సేన" ఏ మేరకు ప్రభావం చూపుతుందో అన్న విషయంలో ప్రజల్లో ఆసక్తికర మైన చర్చ జరుగుతున్నట్లు గమనించవచ్చు రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. 

"తెలంగాణ రాష్ట్ర సేన" ఏర్పాటు తర్వాత ఎన్ని విమర్శలు వచ్చిన లెక్కచేయకుండా తాను ఎంచుకున్న మార్గంలో నడుస్తున్న కవిత టిఆర్ఎస్ ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తుంది. 

సిరిసిల్ల నియోజకవర్గంలో గురువారం టిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా పండగపై ఆసక్తికరమైన చర్చ నియోజకవర్గంలో కొనసాగుతోంది. భారత రాష్ట్ర సమితి కి పెట్టని కోటల నిలబడ్డ సిరిసిల్ల ఓటర్ల పై ఏ  మేరకు కవిత టిఆర్ఎస్ ప్రభావం పడుతుందొనన్న ఆసక్తికర చర్చ ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ మారింది.

సిరిసిల్ల రాజకీయాల్లో కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యేక ముద్ర

సిరిసిల్ల నియోజకవర్గంలోని రాజకీయాల్లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యేక ముద్ర వేశారని చెప్పవచ్చు. కేటీఆర్ ప్రత్యక్ష రాజకీయాలలో తొలిసారిగా సిరిసిల్ల శాసనసభ్యులు గా 2009 లో అప్పటి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న కే.కే. మహేందర్ రెడ్డి పై కేవలం ఒక 1 71 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. 2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో కల్వకుంట్ల తారక రామారావు 26. 93 శాతం నుండి 58. 73 శాతం వరకు ఓట్ల శాతం పెరిగినట్లు గమనించవచ్చు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సానుకూల వాతావరణం సిరిసిల్లలో కూడా అప్పట్లో కల్వకుంట్ల తారక రామారావు కలిసి వచ్చిందని భావించవచ్చు.2018 లో కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్ల నియోజకవర్గం అత్యధిక మెజారిటీ నీ అందించింది. తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపిన 2023 ఎన్నికల్లో కూడా భారత రాష్ట్ర సమితి నుంచి కల్వకుంట్ల తారక రామారావు అనేక రాజకీయ అంచనాలను తలకిందులు చేస్తూ మరోసారి విజయబావుట ఎగురవేశారు. ఏ ఎన్నికల్లో అయిన తన ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ సిరిసిల్ల నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా భారత రాష్ట్ర సమితి నిలబెడుతూ వస్తున్న పరిస్థితిని గమనించవచ్చు. అంతెందుకు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన ఫలితాలను గమనిస్తే కేటీఆర్ ప్రభావం గమనించవచ్చు ప్రతిపక్ష పార్టీగా ఉన్న భారత రాష్ట్ర సమితి నుంచి నేరుగా సిరిసిల్ల మున్సిపాలిటీలో 29 మంది కౌన్సిల్ సభ్యులనుగెలిపించుకొని తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. గతంలో అధికారంలో ఉన్న నాటికంటే ఈ సంఖ్య ఎక్కువే ఇలా తిరుగులేని శక్తిగా ఉన్న భారత రాష్ట్ర సమితి పై కవిత టిఆర్ఎస్ ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్న విషయంపై ఇప్పుడు నియోజకవర్గంలో తీవ్ర ఆసక్తికర చర్చను గమనించవచ్చు.

అన్న కోటలో చెల్లి జెండా పండుగ

రాజకీయ పార్టీ గా "తెలంగాణ రాష్ట్ర సేన " ఏర్పాటు తర్వాత తొలిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జెండా పండుగలో కవిత పాల్గొనడం ఏలాంటి రాజకీయ సమీకరణలకు మార్పులకు దారితీస్తుందో అన్న విషయం పై ఇప్పుడు రాజకీయ పరిశీలకులు అనేక ఊహగానాలు చేస్తున్నారు.

ప్రధానంగా సిరిసిల్ల నియోజకవర్గంలో ని ఎల్లారెడ్డిపేట ముస్తాబాద్ గంభీరావు పేట, వీర్నపల్లి మండలాల నుండి జన సమీకరణ ఎక్కువగా జెండా పండగ కోసం జరిగినట్లు గమనించవచ్చు. అయితే రానున్న రోజుల్లో కవిత తెలంగాణ రాష్ట్ర సేన టిఆర్ఎస్ ఏ మేరకు ప్రభావితం చేస్తుందో.? టిఆర్ఎస్ రూపంలో రాజకీయ ఆధిపత్యం కోసం అన్నపై చెల్లి చేస్తున్న పోరాటం ఏ పార్టీకి ఏ రూపంలో కలిసి వస్తుందన్న విషయంలో ఎవరి అంచనాలు వారికి ఉన్నట్లు కనిపిస్తుంది. 

ఇప్పటికైతే సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ లే కాక పలువురు స్వతంత్ర అభ్యర్థులు సిరిసిల్ల నియోజకవర్గంలో అధిక శాతం ఉన్న సామాజిక వర్గం నుంచి పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న విషయం గమనంలో ఉంచుకుంటే ప్రస్తుతానికైతే సిరిసిల్ల నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఉన్న బిఆర్ఎస్ కే కాక మిగిలిన రాజకీయ పార్టీలకు ఇప్పుడు కవిత టిఆర్ఎస్ కూడా తెర పైకి రావడం ప్రజల్లో కొత్త అంచనాలపై ఆసక్తికర చర్చ మాత్రం నడుస్తోంది.


 _ అల్లే రమేష్, సిరిసిల్ల.

Image 1

"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు

Posted On 2026-06-19 08:33:46

Readmore >
Image 1

అరవల్లి SI ఈట సైదులు సస్పెండ్

Posted On 2026-06-19 08:09:23

Readmore >
Image 1

శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-19 08:06:56

Readmore >
Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-18 20:47:25

Readmore >
Image 1

స్కూళ్ల మూసివేత నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి

Posted On 2026-06-18 20:45:05

Readmore >
Image 1

ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం

Posted On 2026-06-18 20:43:25

Readmore >
Image 1

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-18 18:24:01

Readmore >