| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం : మంజుల పత్తిపాటి

శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం : మంజుల పత్తిపాటి

డైలీ భారత్ స్పెషల్: 

శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం...

యుద్ధపు నీడలో ఊరు దూరమై పోతే...

శాంతి వెతుకుతూ అడుగు ముందుకు వేస్తే…

చూడండి వారి కళ్లలో దాగిన కథలు..!

వినండి ఆ నిశ్శబ్దంలో ఉన్న వ్యథలు…!

కలలన్నీ కాలిపోయి  మిగిలిన ఒంటరి డొక్కలను 

ఎందుకు అర్థం చేసుకోదు ఈ సరిహద్దులు రేఖలు..?

ఆశ్రయం కోసం అలసిన ఆ అడుగుల ఆర్తనాదాన్ని ఎందుకు అర్థం చేసుకోవు ఈ సరిహద్దులు రేఖలు..?

సహాయం చేయడం కేవలం దానం కాదు,

మనిషి మనిషిగా నిలవడం..!

ఒక గుండె విరిగిన కథ ఇది..!

ఒక తల్లి మౌనం వెనుక దాగిన వేదన సత్యం ఇది..!

ఆశ్రయం కోసం అలసిన ఆ అడుగుల చప్పుడు 

మనసు తడిపే కన్నీటి నిశ్శబ్ద గానం విని 

మంజుల పత్తిపాటి కలం  చెబుతుంది 

మనిషి కోసం మనిషి నిలవాలి అని


రచన: మంజుల పత్తిపాటి

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం

చరవాణి 9347042218

Previous "మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం
Next అరవల్లి SI ఈట సైదులు సస్పెండ్
ADVERTISEMENT