| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అరవల్లి SI ఈట సైదులు సస్పెండ్

అరవల్లి SI ఈట సైదులు  సస్పెండ్

డైలీ భారత్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం, నారాయణపురిల్ పరిధిలోని అరవల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఈట సైదులు బుధవారం జిల్లా ఎస్పీ కె. నరసింహ సస్పెండ్ చేశారు.

విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడమే కాకుండా, ఒక కేసుకు ఫోన్ చేసి కేసు వ్యవహారంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన ఆరోపణలను సీరియస్‌గా పరిగణించిన ఉన్నతాధికారులు ఈ చర్య తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

పలు కేసుల్లో ఆర్ధారాలను తారుమారు చేసే అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ ఘటనలపై ఉన్నతాధికారులు ప్రాథమిక స్థాయిలో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

విచారణలో బయటపడిన అంశాల ఆధారంగా తక్షణ చర్యగా సస్పెన్షన్ విధించినట్లు సమాచారం.

ఈ పరిణామం పోలీస్ విభాగంలో చర్చనీయాంశంగా మారింది.

అయితే, ఈ ముద్దుకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

Previous శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం : మంజుల పత్తిపాటి
Next "సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
ADVERTISEMENT