హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చర్చ్ నిర్మాణం
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గాండ్ల గూడెం గ్రామంలో గ్రామ దేవత గుడినీ అనుకోని చర్చి నిర్మించడాన్నీ వ్యతిరేకించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి,వారు మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా గ్రామ దేవత గుడి ఆనుకొని పెద్ద ఎత్తున చర్చి నిర్మించడాన్ని బీజేపీ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని,ఇలాంటి నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల ఉపేక్షించేది లేదని హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని,తక్షణమే రెవెన్యూ అధికారులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించి ఎవరైతే హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా చర్చి నిర్మాణాలు చేపడుతున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని,అట్టి నిర్మాణాలకు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వొద్దు అని బిజెపి నాయకులు తంబళ్ల రవి డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో గంగిశెట్టి వరప్రసాద్,కృష్ణా స్వరూప్ రాథోడ్,భూక్య బాలాజీ నాయక్,గ్రామస్తులు పాల్గొన్నారు.