| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్

నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్

డైలీ భారత్, కామారెడ్డి : ఎం.పి.పి.ఎస్. సరంపల్లి పాఠశాలలో నూతన విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకొని కొత్త మరియు పాత విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలుకుతూ ఇటీవల మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించారు.అనంతరం  యూకేజీ మరియు 1వ తరగతి విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అలాగే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు మరియు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం తల్లిదండ్రులు – ఉపాధ్యాయుల సమావేశం (PTM) నిర్వహించారు.

ఈ సందర్భంగా నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్ ప్రారంభించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్.ఎం. సాయిరెడ్డి , హెచ్.ఎం. అనిల్ గారు,సొసైటీ డైరెక్టర్ బక్కనగారి రాజు, AAPC చైర్మన్ ఆకుల సుజాత  రాజయ్య ,పాల్వంచ దేవేందర్ , కొత్తూరి పెద్ద సాయిలు, స్వామి రాజ్, ముల్క శ్రీనివాస్ ఉపాధ్యాయులు, AAPC సభ్యులు, అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు యమున బాయి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

Previous రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Next హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
ADVERTISEMENT