| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం

ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం

డైలీ భారత్, కామారెడ్డి: 2010 సంవత్సరం కన్నా ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్  నుండి మినహాయింపు ఇవ్వాలని వినతిపత్రం అదనపు కలెక్టర్ ఎన్ వి గిరికి ఇవ్వడం జరిగింది.

2010 సంవత్సరం కన్నా ముందు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నుండి మినహాయింపు కల్పించాలని కోరుతూ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ సొసైటీ (తపస్) కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గౌరవ జిల్లా అదనపు కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ వినతిపత్రాన్ని ప్రధాన మంత్రి  కి, కేంద్ర విద్యాశాఖ మంత్రి కి మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి పంపించాలని కోరారు.

ఈ సందర్భంగా తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  రాఘవరెడ్డి మాట్లాడుతూ, 2010 సంవత్సరం కన్నా ముందు ఉపాధ్యాయులుగా నియమితులైన వారు ఇప్పటికే ప్రభుత్వ నియామక ప్రక్రియలో భాగంగా పలు అర్హత పరీక్షలు, ఎంపిక పరీక్షలు పూర్తి చేసి ఉద్యోగాలలో చేరారని తెలిపారు. అలాంటి ఉపాధ్యాయులు ఎన్నో సంవత్సరాలుగా విద్యా సేవలను అందిస్తూ తమ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్న సమయంలో, మళ్లీ టెట్ పరీక్ష రాయాలని కోరడం సహేతుకం కాదని పేర్కొన్నారు.

జాతీయ విద్యా విధాన లక్ష్యాలను సాధించడంలో మరియు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వడం న్యాయసమ్మతమైన చర్య అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి, 2010కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు ప్రత్యేక మినహాయింపు కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తపస్ కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి  సత్యనారాయణ, లక్ష్మిపతి,  భాస్కర్,  స్వామి మరియు ఇతర తపస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Previous హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Next స్కూళ్ల మూసివేత నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి
ADVERTISEMENT