| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

డైలీ భారత్, వరంగల్: వరంగల్ నగరంలోని కాశీబుగ్గ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కాశీబుగ్గ తిలక్ రోడ్డుకు చెందిన గంజి కీర్తన (25) అనే యువతి తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కీర్తన బెంగళూరులోని ఓ విదేశీ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఉండేది. గత కొంతకాలంగా ఉద్యోగ ఒత్తిడిని తట్టుకోలేక మానసిక ఆందోళనకు గురై చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె తండ్రి గంజి ఉమాశంకర్ వ్యాపార పనుల నిమిత్తం బయటకు వెళ్లగా, తల్లి కృష్ణవేణి గ్రీవెన్స్ సెల్‌కు వెళ్లారు. ఈ సమయంలో కీర్తన ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు సమాచారం. అనంతరం ఇంటికి వచ్చిన తల్లి, కిటికీ ద్వారా చూడగా కీర్తన బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు చున్నితో ఉరికి వేలాడుతూ కనిపించింది.

వెంటనే బంధువుల సహాయంతో తలుపులు బలవంతంగా తెరిచి లోపలికి వెళ్లి చున్ని కోసి కిందకు దించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న ఇంతేజార్ గంజ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కీర్తన మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం..

Previous 150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం
Next పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..
ADVERTISEMENT