| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

డైలీ భారత్, కామారెడ్డి : జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.

ఈ సందర్భంగా మొత్తం 93 దరఖాస్తులు వచ్చాయని భూ సమస్యలు, సంక్షేమ పథకాలు, పెన్షన్లు, ఉపాధి, గృహాలు, రెవెన్యూ , ఇతర శాఖలకు సంబంధించిన వినతులు ప్రజలు సమర్పించారు.

అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు విక్టర్, NV గిరి, zp CEO చందర్, జిల్లా  అధికారులు పాల్గొన్నారు.

Previous అట్ట పుట్టల వితరణ
Next ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
ADVERTISEMENT