| Daily భారత్
Logo




ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

News

Posted on 2026-06-15 15:49:40

Share: Share


ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో  కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

డైలీ భారత్, కామారెడ్డి : భారతదేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ అయిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS) సభ్యత్వ నమోదు ప్రత్యేక డ్రైవ్ కామారెడ్డి పట్టణంలోని ఆర్కే (RK) డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఘనంగా నిర్వహించబడింది. మే 15 నుండి జూన్ 15 వరకు ప్రభుత్వం విధించిన సభ్యత్వ నమోదు గడువు నేటితో ముగియనుండటంతో, ఈ రోజున ఈ ప్రత్యేక  కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీ  వై.వి . గిరి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక అతిథులుగా జిల్లా లేబర్ ఆఫీసర్ శశికుమార్ ,  మరియు ఆర్కే విద్యాసంస్థల సీఈఓ యం.డాక్టర్ జైపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి అడిషనల్ కలెక్టర్ వై. వి .గిరి  మాట్లాడుతూ ప్రస్తుతం రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లా  రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో (Number 1) నిలిచేందుకు అవకాశం ఉందన్నారు. మన జిల్లా కలెక్టర్  సూచనతో RK CEO జైపాల్ రెడ్డి గారు పాట్రన్ మెంబర్ షిప్ తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచినందుకు అభినందనలు తెలిపారు. సభ్యత్వ నమోదుకు చివరి రోజు కావడంతో విద్యార్థులు, యువత, సమాజ సేవకులు, ఉద్యోగ, వ్యాపార వాణిజ్య వేత్తలు మరియు పౌరులు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి జిల్లాను అగ్రస్థానంలో (Number 1) ఉంచాలని చెప్పారు. 

డాక్టర్ జైపాల్ రెడ్డి  మాట్లాడుతూ..

1000రూ|| లతో Lifetime Membership, 

 కేవలం రూ. 250 చెల్లించి జీవితకాల అసోసియేట్ సభ్యత్వం (Lifetime Associate Membership) పొందే ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, సేవా కార్యక్రమాల్లో యువతే కీలకం అనీ ,విపత్తుల సమయంలో, రక్తదాన శిబిరాల నిర్వహణలో రెడ్ క్రాస్ పాత్ర అసామాన్యమైనదని, విద్యార్థులు తమ వంతు బాధ్యతగా సభ్యత్వం తీసుకోవాలని సూచించారు.ఈ  కార్యక్రమంలో  రాజన్న , దత్తాత్రి, నవీన్, ప్రిన్సిపాల్స్, అధ్యాపక బృందం, విద్యార్థులు, యువత కేజీ టు పీజీ ఉపాధ్యాయులు అందరూ పాల్గొని ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా సభ్యత్వ నమోదు చేసుకున్నారు.

Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి

Posted On 2026-08-28 14:19:41

Readmore >
Image 1

ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా

Posted On 2026-08-28 14:18:02

Readmore >
Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >
Image 1

చలానా కాదు.. రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన!

Posted On 2026-08-28 08:06:13

Readmore >
Image 1

ఒక ప్రత్యేకమైన వాగ్దానం కారణంగా కట్టబడిన తొలి రాఖీ

Posted On 2026-08-28 07:11:25

Readmore >