| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

విద్యార్థులకు అండగా సీఐ ప్రశాంత్ కుమార్...

డైలీ భారత్, అమలాపురం: తండ్రిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇద్దరు విద్యార్థులకు రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్ అండగా నిలిచారు. 

సమనస శ్రీ రామా పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న పేరాబత్తుల పూర్ణ సత్య దుర్గ (10వ తరగతి), పేరాబత్తుల పవన్ (6వ తరగతి)లకు ఆయన ఒక సంవత్సరం పాటు సరిపడే పాఠశాల ఫీజులను చెల్లించారు.

సీఐ ప్రశాంత్ కుమార్ స్వయంగా పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను కూడా అందజేశారు. తండ్రి మరణంతో విద్యాభ్యాసానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ విద్యార్థులకు చేయూతనందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీ గణేష్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీఐ ప్రశాంత్ కుమార్ చేసిన సహాయం అభినందనీయమని పేర్కొన్నారు. వారి దాతృత్వానికి పాఠశాల యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

పోలీసులు కేవలం చట్టం అమలు, క్రమశిక్షణ, పరిరక్షణకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో అవసరమైన వారికి అండగా నిలుస్తున్నారని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.


#DrAmbedkarKonaseemaDistrictpolice #Amalapuram #Police

Previous ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య
Next అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
ADVERTISEMENT