| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు దన్నారపు రాజలింగం కు ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడైన అమరవాది లక్ష్మీనారాయణ వారి ఆదేశంతో ఉపాధ్యక్షుడు అయినా కైలాస శ్రీనివాసరావు గుప్తా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గం 2026-2028 సంవత్సరముల పదవీ కాలానికి దన్నారపు రాజలింగం కు నియామక పత్రం అందజేశారు. రాజలింగం మాట్లాడుతూ తనకు మీడియా కమిటీ కార్యదర్శిగా నియమించినందుకు అధ్యక్షుడైన అమరవాది లక్ష్మీనారాయణకు అలాగే దీనికి సహకరించిన కైలాస్ శ్రీనివాసరావు గుప్తాకు, శనిశెట్టి శెట్టి గౌరిశంకర్కు, అతిమాముల రమేష్ గుప్తాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొగిలిపల్లి భూమేష్, ఉప్పల హరిధర్, రాజేందర్, శనిశెట్టి శ్రీనివాస్, కస్తూరి నరహరి మొదలగు వారు పాల్గొనడం జరిగింది.

Previous ఖమ్మం చిన్నారి పై అత్యాచారానికి పాల్పడిన దోషినీ కఠినంగా శిక్షించాలి : బిజెపి పార్టీ తంబళ్ల రవి
Next రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా వ్యాప్తంగా స్క్రాప్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు
ADVERTISEMENT