డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట బిజెపి పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు,తంబళ్ల రవి మాట్లాడుతూ ఖమ్మంలో చిన్నారిపై జరిగిన హత్యాచార నిందితుడిని కఠినంగా శిక్షించాలీ,ఖమ్మం నగరంలో మానవత్వాన్ని మంటగలిపేలా,అత్యంత పశుప్రవృత్తితో ఒక చిన్నారిపై జరిగిన హత్యాచార సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని,మానసిక క్షోభను కలిగించింది,నిందితుడు మృగాడిలా ప్రవర్తించి,ఆపై పసిపాపను భవనం పైనుంచి కిందకు తోసి హత్య చేసిన తీరు సమాజం తలదించుకునేలా చేసిందనీ,ఈ అమానుష ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము,సమాజంలో మహిళలు,ముఖ్యంగా పసిపిల్లలపై జరుగుతున్న ఇటువంటి దారుణాలు చట్టాల అమలు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మరియు రక్షణ వ్యవస్థలపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి,అమాయకపు చిన్నారి పై జరిగిన ఈ ఘటనలో నిందితుడిని ఏమాత్రం ఉపేక్షించకూడదనీ వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు కారం రత్నకుమారి,ఆళ్ల సుజాత,తంబళ్ల నాగేంద్ర,బీజేపీ సీనియర్ నాయకులు గుడా ముత్యాలరావు,దారా నాగేశ్వరావు ,పూచి ప్రసాద్ ,దారా మోహన్ రావు, సత్యనారాయణ,భూషణం,సాయి,నాగు తదితరులు పాల్గొన్నారు.
News
ఖమ్మం చిన్నారి పై అత్యాచారానికి పాల్పడిన దోషినీ కఠినంగా శిక్షించాలి : బిజెపి పార్టీ తంబళ్ల రవి