| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జర్నలిస్ట్ పిల్లలకు 100% ఫీజు రాయితీ ఇవ్వాలి

జర్నలిస్ట్ పిల్లలకు 100% ఫీజు రాయితీ ఇవ్వాలి

టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టర్, డీఈఓ లకు వినతి

డైలీ భారత్, కామారెడ్డి: జిల్లాలోని అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో 100% ఫీజు రాయితీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు.  ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ మాట్లాడుతూ... జిల్లాలో 500 పైగా అర్హులైన జర్నలిస్టులు ఉన్నారు. వీరిలో పేద, మధ్యతరగతి కి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. అందుకని వారి పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో 100% ఫీజు రాయితీ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ జీవో ప్రకారం 100% రాయితీని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ కార్యాలయ సూపరిండెంట్ వరప్రసాద్, జిల్లా విద్యా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ లకు వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రాజేష్ , ఆబిద్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్, జర్నలిస్టులు శివ, శ్రీకాంత్, శ్రీనివాస్ రెడ్డి, ముదాం శంకర్,  వెంకటేశ్వర్లు, మాణిక్య శ్రీకాంత్, మధు, ప్రభు తదితరులు పాల్గొన్నారు.

Previous బాలికపై దారుణానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి
Next దమ్మపేట మండలం సరోజ నాపురం కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న మదిశెట్టి సామేలు
ADVERTISEMENT