| Daily భారత్
Logo




ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ

News

Posted on 2026-06-11 14:56:53

Share: Share


ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమాజం భాగస్వామ్యం కావాలని పిలుపు

డైలీ భారత్, కామారెడ్డి : ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం (World Day Against Child Labour) సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో సాధన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కల్పించే వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారి చేతుల మీదుగా వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, బాల కార్మిక వ్యవస్థ సమాజ అభివృద్ధికి ఆటంకమని, ప్రతి చిన్నారికి విద్య, రక్షణ మరియు మంచి భవిష్యత్తు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని సూచించారు.

ప్రతి సంవత్సరం జూన్ 12న ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణ మరియు వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరంపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.

పిల్లలు దేశ భవిష్యత్తుకు పునాదులు. వారిని పనుల్లో నిమగ్నం చేయడం వల్ల వారి శారీరక, మానసిక మరియు విద్యా అభివృద్ధికి తీవ్ర ఆటంకం కలుగుతుంది. అందువల్ల 14 సంవత్సరాల లోపు పిల్లలను ఏ విధమైన పనుల్లోనూ నియమించరాదని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధిత శాఖలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, బాల కార్మికులను గుర్తించి వారికి విద్యా అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. ప్రజలు కూడా బాల కార్మికులను పనుల్లో పెట్టుకోకుండా, అలాంటి ఘటనలు గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

"బాల్యం చదువుకోడానికి – పని చేయడానికి కాదు" అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని బాలల హక్కుల పరిరక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సాధన సంస్థ జిల్లా కోఆర్డినేటర్ గిరిజ, సీఎస్‌ఎం మమత, సంధ్యారాణి, విశ్వజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం – ప్రతి చిన్నారికి విద్య, రక్షణ మరియు సంతోషకరమైన బాల్యం అందిద్దాం.

Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >
Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >
Image 1

కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్​కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్

Posted On 2026-08-29 15:08:39

Readmore >
Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >