సిరిసిల్ల సుందరయ్య నగర్ అర్బన్ పీహెచ్ సీ ఆకస్మిక తనిఖీ.
డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల: వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల సుందరయ్య నగర్ లోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్ సీ)లో జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఓపీ, వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్ తనిఖీ చేశారు. ఏఎన్సీ నమోదు, ఎన్సీడీ స్క్రీనింగ్ టెస్టులపై ఆరా తీశారు. వ్యాక్సిన్ గది, మందులు పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని, ప్రభుత్వ వైద్యశాలల్లోనే ప్రసవాలు, చికిత్స పొందేలా వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రత పై వివరించాలని పేర్కొన్నారు. సబ్ సెంటర్ లలో మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎన్ సీడీ స్క్రీనింగ్ టెస్టులు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.