| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దమ్మపేట మండలం సరోజ నాపురం కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న మదిశెట్టి సామేలు

దమ్మపేట మండలం సరోజ నాపురం కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న మదిశెట్టి సామేలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సరోజనాపురంలో  నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఎన్సీపీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు (ఎన్వైసీ), ఆంధ్రప్రదేశ్ & ఒడిశా రాష్ట్రాల ఇన్‌చార్జి డా. మద్దిశెట్టి సామేలు పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్సీపీ పార్టీ – ఎన్డీఏ మహాకూటమిని అవమానపరిచే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేసినా, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలకు పాల్పడినా సహించేది లేదని హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే వారిపై పార్టీ క్రమశిక్షణా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 15 మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.

Previous జర్నలిస్ట్ పిల్లలకు 100% ఫీజు రాయితీ ఇవ్వాలి
Next డిప్యూటీ ఈవో పోస్టులకు బిఈడీ,ఎంఈడీ చేసిన వారికే అవకాశం కల్పించాలి
ADVERTISEMENT