Posted on 2026-05-23 17:47:18
17.5 గ్రాముల బంగారు ఆభరణాలు,14.5 తులాల వెండి ఆభరణాలు మూడు ద్విచక్ర వాహనాలు ఒక ఆటో రెండు సెల్ ఫోన్స్ స్వాధీనం.
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డిఎస్పీ నాగేంద్రచారి
నిందితుల వివరాలు:
1.ఆడెపు రవి s/o శ్రీనివాస్, 25 సం లు, r/o B.Yనగర్ సిరిసిల్ల.
2.సామల్ల బాలకిషన్ s/o దేవయ్య, 26 సం లు, r/o నిమ్మపల్లి గ్రామం, కోనరావుపేట మండలం.ప్రస్తుతం సుభాష్ నగర్ వేములవాడ.
3.బోదాసు గోపి s/o రాములు,19 సం లు, r/o చింతల్ టాన గ్రామం, వేములవాడ అర్బన్ మండలం.
4. వేముల సాయి చరణ్ రెడ్డి s/o లక్ష్మ రెడ్డి, 19 సం లు, r/o విద్యనగర్ సిరిసిల్ల.
5. గాజులవేణి అరుణ్ కుమార్ s/o వెంకటేశం, 23 సం లు, r/o కొలనూర్ గ్రామం, కోనరావుపేట మండలం.
6. మూల అభిలాష్ s/o లక్ష్మన్, 19 సం లు, r/o వేల్జిపూర్ గ్రామం ఇల్లంతకుంట మండలం, ప్రస్తుతం విద్యనగర్ సిరిసిల్ల.
7. శీలం సంతోష్ రెడ్డి s/o లింగారెడ్డి, 41 సం లు, r/o అనుపురం వేములవాడ.(receiver)
8. కస్తూరి సాయితేజ s/o కిషన్, 24 సం లు, r/o నార్మల గ్రామం, గంభిరావుపేట మండలం ప్రస్తుతం మొర్రైపల్లీ గ్రామం ముస్తాబాద్ మండలం.(receiver)
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల బి. వై నగర్ కి చెందిన అడెపు రవి అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని పగలు సమయాల్లో పట్టణంలో రెక్కీ చేసి తన స్నేహితులు సామల్ల బాలకిషన్, బోదాసు గోపి, వేముల సాయి చరణ్ రెడ్డి, గాజులవేణి అరుణ్ కుమార్, మూల అభిలాష్ లతో ఒక ముఠాగా ఏర్పడి రాత్రి సమయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు.
అడెపు రవి గతంలో 18 దొంగతనం కేసులలో జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాక మళ్లీ నేరాలకు పాల్పడలని నిర్ణయించుకుని,దొంగతనాలు చేస్తు బంగారు,వెండి ఆభరణాలను అమ్మితే వచ్చిన డబ్బులతో జల్సాలు చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా తేది 26-04-2026 నుండి 21-05-2026 వరకు సిరిసిల్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐదు ఇండ్లలో రాత్రి సమయంలో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారని,ఇంటి యజమానుల ఫిర్యాదు మేరకు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా,తేది 23-05-2026 రోజున ఉదయం నిందుతులు ఏదైనా పెద్ద దొంగతనం చేద్దామని అనుకోని ఆటోలో సిరిసిల్ల కు వస్తుండగా నమ్మదగిన సమాచారంతో సిరిసిల్లలోని ఎల్లమ్మ సర్కిల్ వద్ద అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. అదుపులోకి తీసుకున్న నిందుతులను విచారించగా దొంగతనం చేసిన బంగారు ఆభరణాలు ముస్తాబాద్ లోని కస్తూరి సాయితేజ కి, కొన్ని బంగారు మరియు వెండి ఆభరణాలు వేములవాడలోని శీలం సంతోష్ రెడ్డి కి అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసినామని చెప్పగా వారి వద్ద నుండి బంగారు వెండి ఆభరణాలు,మోటార్ సైకిళ్ళు,ఆటో స్వాదిన పరుచుకొని ఈరోజు రిమాండ్ కి తరలించడం జరిగిందని డిఎస్పీ తెలిపారు. నిందుతులను పట్టుకోవడంలో కృషి చేసిన పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్.ఐ శ్రీకాంత్, సిబ్బంది పుల్కమ్ శ్రీనివాస్, శ్రీకాంత్ , మారుతి, రవి , నాంపెళ్లి శ్రీనివాస్, నాగరాజు లను డిఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు..
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పాట్రన్ మెంబర్‌గా డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి
Posted On 2026-05-23 19:54:28
Readmore >
వార్షిక తనిఖీల్లో భాగంగా లింగంపేట్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-05-23 19:51:54
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా: తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్..
Posted On 2026-05-23 17:47:18
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కోళ్ల ఫారమ్ దగ్ధం..
Posted On 2026-05-22 20:06:53
Readmore >
గంజాయి అక్రమ రవాణాపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-22 19:31:49
Readmore >