Posted on 2026-05-22 12:26:34
అక్రమ మట్టి రవాణాపై 19 కేసులు నమోదు, 45 వాహనాలు సీజ్.
అనుమతిలేని అక్రమ మట్టి తరలింపుపై ప్రత్యేక నిఘా
అక్రమంగా మట్టిని తరలించినా,తవ్వకాలు చేసినా,నిల్వ చేసినా సమాచారం అందించండి.
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: అనుమతి లేకుండా మట్టి తరలింపుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి జిల్లాలో అక్రమ మట్టి రవాణాను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈసంవత్సరం ఇప్పటివరకు అక్రమ మట్టి రవాణాకు సంబంధించి మొత్తం 19 కేసులు నమోదు చేసి, 45 వాహనాలను(27 ట్రాక్టర్లు,11 తిప్పర్స్, 07 జేసిబి లు) సీజ్ చేసినట్లు వెల్లడించారు.అక్రమ మట్టి రవాణాపై పోలీసుల వరుస దాడులు కొనసాగిస్తూ కేసులు నమోదు చేయడం, వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
ఈ మేరకు జిల్లా ఎస్పీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మట్టి త్రవ్వకలు జరిగిన, రవాణా చేసిన కేసులు తప్పవని,జిల్లాలో ఎక్కడైనా మట్టిని తవ్వడం, నిల్వ చేయడం, రవాణా చేయాలంటే ముందస్తుగా సంబంధించిన శాఖ నుండి అనుమతి పొందాలని,లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.జిల్లా పరిధిలో ఎక్కడైనా అక్రమంగా మట్టిని తరలించినా,తవ్వకాలు చేసినా,నిల్వ చేసినా సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ తెలిపారు.
గడిచిన వారం రోజులలో జిల్లాలో అక్రమ మట్టి రవాణాపై నిర్వహించిన డ్రైవ్ వివరాలు.
●.తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేసి 3 టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు.
●.వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేసి 2 ట్రాక్టర్లు, ఒక జేసీబీని సీజ్ చేశారు.
●.బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేసి ఒక జేసీబీ, 4 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.
●.రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేసి 2 టిప్పర్లు, 5 ట్రాక్టర్లు, ఒక జేసీబీని సీజ్ చేశారు.
●.వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేసి ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >