Posted on 2026-05-21 08:12:53
ధాన్యం కొనుగోలు ప్రక్రియపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : ధాన్యం అన్ లోడింగ్ చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని, హమాలీల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ధాన్యం సేకరణ, తూకం వేసిన బస్తాల తరలింపు, వాహనాలు, హమాలీల సంఖ్య పెంచడం, మిల్లుల్లో ధాన్యం అన్ లోడింగ్, ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేయడం, తదితర అంశాలపై గురువారం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, పౌర సరఫరాలు, సహకార శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా, వ్యవసాయ, తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ముఖ్యంగా ఇప్పటికే లారీలు, ట్రాక్టర్ల ద్వారా మిల్లులకు అపరెల్ పార్క్ కు తరలించిన వాహనాలు అన్ లోడ్ చేయడం వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎన్ని వాహనాలు మిల్లుల వద్ద ఉన్నాయో సంబంధిత అధికారులను ఆరా తీశారు. గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. వర్షాలు పడితే కొనుగోలు చేసిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు బాధ్యతగా వ్యవహరించాలని, ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేసేలా పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >