| Daily భారత్
Logo




గోమతి నగర్ రైలులో దారుణం ఘటన...యువతిని ముక్కలుగా నరికి పెట్టెలో దాచారు ..!

News

Posted on 2026-05-19 04:51:33

Share: Share


గోమతి నగర్ రైలులో దారుణం ఘటన...యువతిని ముక్కలుగా నరికి పెట్టెలో దాచారు ..!

డైలీ భారత్, బిహార్: బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్లే ఒక ఎక్స్‌ప్రెస్ రైలులో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఒక యువతిని కిరాతకంగా హత్య చేసి, ఆమె శరీర భాగాలను ముక్కలుగా నరికి గోనె సంచిలో చుట్టి ఇనుప పెట్టెలో దాచారు. ఈ ఘటన ప్రయాణికులను, రైల్వే సిబ్బందిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. లఖ్‌నవూ రైల్వే స్టేషన్‌లో వెలుగుచూసిన ఈ ఘోరం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

బీహార్‌లోని ఛప్రా నుంచి గోరఖ్‌పూర్ మీదుగా లఖ్‌నవూ (గోమతి నగర్) వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు లఖ్‌నవూ స్టేషన్‌కు చేరుకుంది. ప్రయాణికులంతా దిగిపోయిన తర్వాత రైల్వే సిబ్బంది "ఎస్-1" (S-1) స్లీపర్ కోచ్‌లో సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒక ఇనుప పెట్టె, ఒక సంచిని గమనించారు. ఎంతసేపటికీ ఆ పెట్టెను తీసుకునేందుకు ఎవరూ రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది వెంటనే స్టేషన్ మాస్టర్‌ను అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

లఖ్‌నవూ కమిషనరేట్ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ బృందం సమక్షంలో పోలీసులు ఆ ఇనుప పెట్టెను, సంచిని తెరిచి చూడగా అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా హడలిపోయారు. ఇనుప పెట్టెలోని ఒక ప్లాస్టిక్ కవర్‌లో యువతి మొండెం లభ్యమవగా, పక్కనే ఉన్న వేరొక సంచిలో చేతులు, కాళ్లు విడివిడిగా ప్యాక్ చేసి ఉన్నాయి. అయితే, మృతదేహానికి సంబంధించిన తల మాత్రం అక్కడ లభించలేదు. మృతురాలి వయసు సుమారు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని ఫోరెన్సిక్ నిపుణులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. యువతిని ఎక్కడో దారుణంగా హత్య చేసి, ఆధారాలు లభించకుండా ఉండేందుకే దుండగులు శరీర భాగాలను ముక్కలుగా నరికి.. ఇలా పెట్టెలో, కవర్‌లో ఉంచి రైలులో వదిలేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మృతురాలు ఎవరు, ఆమెను అంత దారుణంగా చంపిన కిరాతకులు ఎవరు అనే విషయాలను కనుగొనేందుకు ఛప్రా, గోరఖ్‌పూర్, లఖ్‌నవూ స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు.

Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >