| Daily భారత్
Logo




డాన్ కావాలన్న మోజు... కన్న తల్లినే హతమార్చిన కుమారుడు

News

Posted on 2026-05-16 07:17:54

Share: Share


డాన్ కావాలన్న మోజు... కన్న తల్లినే హతమార్చిన కుమారుడు

16 ఏళ్లకే మాఫియా డాన్ కావాలన్న మోజు.. 

కన్న తల్లినే హతమార్చిన కుమారుడు

డైలీ భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా రాజాంలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఇటీవల పదో తరగతి పూర్తి చేసిన ఓ బాలుడు, తన స్నేహితుడితో కలిసి కన్న తల్లినే కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

ముంజేటి సతీష్, స్పందన(34) దంపతుల కుమారుడు స్కూల్లో ఓ అమ్మాయికి ప్రేమలేఖ రాశాడని యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. దీంతో బుద్ధిగా ఉండాలని, చదువుపై దృష్టి పెట్టాలని తల్లి పలుమార్లు కుమారుడిని మందలించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న బాలుడు తల్లిపై కక్ష పెంచుకున్నాడు.

ఇదే సమయంలో “మనం ముంబై వెళ్లి మాఫియా డాన్లు అవుదాం” అంటూ తన స్నేహితుడితో కలిసి ప్రణాళిక రచించిన నిందితుడు, తల్లి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దారుణానికి పాల్పడ్డాడు.

ఇంట్లో ఉన్న తొమ్మిదిన్నర తులాల బంగారం, రూ.5 వేల నగదును బ్యాగులో వేసుకున్న అనంతరం, స్నేహితుడి సహాయంతో తల్లిపై కత్తితో దాడి చేశాడు. మొత్తం 16 కత్తిపోట్లు పొడిచి ఆమె మృతి చెందినట్లు నిర్ధారించుకున్న తర్వాత, మృతదేహాన్ని చీరతో చుట్టి ఇంటి పక్కనే ఉన్న కోనేరులో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు బాలురను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు

Posted On 2026-09-04 03:56:31

Readmore >
Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >