డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : షాద్‌నగర్ పట్టణంలోని 25వ వార్డు కౌన్సిలర్ పెంటయ్య జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ హాజరై శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొప్పునూరి ప్రవీణ్, దిలీప్, ముబారక్ అలీఖాన్, చందూలాల్, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
News
25 వ వార్డు కౌన్సిలర్ పెంటయ్యకు శుభాకాంక్షలు వెల్లువ