డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన భీమారం సర్పంచ్ గీత వీరేశం గుప్త.ఆదివారం షాద్ నగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ గీత వీరేశం మాట్లాడుతూ నవతరం నాయకుడు, ప్రజల మనసులు గెలుచుకున్న జన హృదయ నేత, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.భవిష్యత్తులో మీ నాయకత్వంలో షాద్ నగర్ మరింత అభివృద్ధి చెందాలని, మీకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.అంజయ్య యాదవ్ మంచి మనస్సున్న నేత అని, ఎంతోమంది పేదల పక్షాన నిలిచి సేవ చేశారని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో భీమారం ఉప సర్పంచ్ మల్లేష్ నాయక్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు లక్ష్మన్ నాయక్, ఎస్టి సెల్ మండల అధ్యక్షులు రాజేష్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, శ్రీశైలం, సత్యం భీమారం వార్డు సభ్యులు వీరేశం, ప్రశాంత్ గౌడ్,యాదయ్య ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
News
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన భీమారం సర్పంచ్ గీత వీరేశం గుప్తా