| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్ల టీచర్లకు హైదరాబాద్‌లో టీ-సాట్ శిక్షణ... ప్రశంసాపత్రాల ప్రదానం

సిరిసిల్ల టీచర్లకు హైదరాబాద్‌లో టీ-సాట్ శిక్షణ... ప్రశంసాపత్రాల ప్రదానం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతికత ఆధారంగా నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో పీఎం ఈ-విద్యా (PM eVidya) DTH ఛానెళ్ల కోసం ఉపాధ్యాయులకు నాలుగు రోజుల ప్రత్యేక సాంకేతిక శిక్షణను నిర్వహించారు.

అక్టోబర్ 6 నుంచి 9వ తేదీ వరకు హైదరాబాద్‌లోని టీ-సాట్ (T-SAT) కార్యాలయంలో CIET-NCERT, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిక్షణా కార్యక్రమం జరిగింది.

ఈ శిక్షణలో భాగంగా పాఠ్యాంశాలకు అనుగుణంగా స్క్రిప్ట్ రచన, స్టోరీబోర్డ్ రూపకల్పన, ప్రీ-ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్-ప్రొడక్షన్ ప్రక్రియలపై NCERT ప్రొఫెసర్లు, నిపుణులు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులచే స్వయంగా విద్యా వీడియోలను రూపొందింపజేసి, బోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించే మెలకువలను నేర్పించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి చందుర్తి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కాపిల్ల నరేష్, జోగాపూర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు అంజయ్య, తిమ్మాపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు స్వరాజ్యలక్ష్మి ఈ శిక్షణలో పాల్గొన్నారు.

శుక్రవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో SCERT తెలంగాణ డైరెక్టర్ గాజర్ల రమేష్, టీ-సాట్ సీఈఓ వేణుగోపాల్, తెలంగాణ పీఎం ఈ-విద్యా కోఆర్డినేటర్ కోమల్ అరోరా చేతుల మీదుగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఈ శిక్షణ ద్వారా డిజిటల్ సాంకేతికతను ఉపయోగించి ఆకర్షణీయమైన, నాణ్యమైన బోధనా వీడియోలను రూపొందించడంతో పాటు, రాష్ట్ర విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యను మరింత చేరువ చేసేందుకు అవసరమైన నైపుణ్యాలు లభించాయని నిర్వాహకులు తెలిపారు.

Previous కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కోడిప్యాక సాయిరాంకు అరుదైన గౌరవం... రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పదోన్నతి
ADVERTISEMENT